English   

తారక్ టీజర్..క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

NTR RRR Teaser
2020-10-05 07:50:25

ప్రస్తుతం సినీప్రియులు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. దర్శకధీరుడుకి బాహుబలి హిట్ తో దేశవ్యాప్తంగా పేరు రావడంతో బాలీవుడ్ హీరోలు ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని భయటకు చెప్పేసారు. అయినప్పటికీ రాజమౌళి మాత్రం తెలుగు హీరోల టాలెంట్ ను దేశానికి చూపించడానికి మళ్ళీ ఇద్దరు టాలీవుడ్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లను సెలెక్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే షూటింగ్ ను కూడా ప్రారంభించారు. అంతే కాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవల లాక్ డౌన్ లో చేసిన సడలింపుల్లో షూటింగ్ లకు అనుమతివ్వడం తో రాజమౌళి షూటింగ్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 

అయితే ఇప్పటికే సినిమాలోని రాంచరణ్ కు సంబందించిన ఓ టీజర్ ను చరణ్ బర్త్ డే సంధర్బంగా విడుదల చేసారు. దాంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. మరోవైపు ఎన్టీఆర్ కు సంబందించిన టీజర్ ను షూట్ చేసి విడుదల చేయాలనుకునే లోపే కరోనా కారణంగా లాక్ డౌన్ వచ్చి షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు షూటింగ్ తిరిగి ప్రారంభిస్తుండటంతో ఎన్టీఆర్ టీజర్ రబోతుందని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. దానిపై తాజాగా రాజమౌళి ఆ విషయం పై క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ..."కరోనా కు ముందు నేను డేట్ చెప్పాను కానీ ఇప్పుడు చెప్పలేను. షూటింగ్ లకు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. వాటి ప్రకారంగా అనుకున్న టైం లో షూట్ చేయగలనా ..షూట్ కి ఇంకా టైం పడుతుందా అన్నది సెట్స్ పైకి వెళ్ళితే కానీ చెప్పలేను. ప్రస్తుతానికి అయితే  రెండు నెలలు ప్లాన్ చేసుకున్నాం. రేపో మాపో సెట్స్ పైకి వెళతాం.. అనుకున్నట్టుగా జరిగితే అప్పుడు డేట్ ప్రకటిస్తాను. అని రాజమౌళి క్లారిటీగా చెప్పేశారు.

More Related Stories