English   

బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం..ఇలా స్పందించిన అక్షయ్

 Akshay Kumar
2020-10-05 08:08:40

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత బాలీవుడ్ పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్ పరిశ్రమకు చెందిన నలుగురు హీరోయిన్ లను ఎన్సీబి అధికారులు విచారించారు. కేసులో సారా అలీఖాన్, దీపికా పదుకునే, శ్రద్దా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లపై ఆరోపణలు రావడంతో వారిని విచారించారు. కాగా హీరోయిన్లు డ్రగ్స్ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారులకు చెప్పారు. దాంతో ఎన్సీబి అధికారులు ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు. కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేదానిపై దృష్టి సాధిస్తున్నారు. కాగా పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేగడంతో పరిశ్రమపై విమర్శలు వస్తున్నాయి. పరిశ్రమలో అందరికి డ్రగ్స్ తో సంబంధాలున్నాయని. ఇండస్ట్రీలో డ్రగ్స్ కామన్ అని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. 

ఇక ఈ ఆరోపణలపై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. చాలా రోజుల నుండి ఏదో చెప్పాలని అనుకుంటున్నానని..ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని అక్షయ్ తన వీడియోను షేర్ చేశారు. వీడియో లో అక్షయ్ మాట్లాడుతూ...మీడియాపై తన విశ్వాసాన్ని తెలిపారు.  అంతే కాకుండా మీడియా తన గొంతును కొనసాగించాలని కోరారు. అయితే ఒక సున్నితమైన ఒకరి కెరీర్ ను నాశనం చేస్తుందని, కాబట్టి సున్నితంగా డీల్ చేయాలని కోరారు. "సినీ పరిశ్రమపై కొందరికి నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. త్వరలోనే వారు నిజాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. కొందరి కారణంగా పరిశ్రమ మొత్తాన్ని ప్రతికూలంగా చూడవద్దని వేడుకుంటున్నాను" అంటూ అక్షయ్ పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ పరిశ్రమపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే అక్షయ్ తన మనసులోని భావాలను ఇలా భయట పెట్టారు.

More Related Stories