English   

ఎవరూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం లేదేంటి.. థియేటర్స్ అవసరం లేదా...

Telugu Producers
2020-10-05 08:14:47

అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం చెప్పగానే చాలా సంతోషించారు. ఇక మళ్ళీ మునుపటి పరిస్థితి వస్తుంది.. థియేటర్ల దగ్గర హంగామా కనిపిస్తుంది అని కలలు కనేసారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అలాంటి ఆశలు పెట్టుకోవద్దు అనిపిస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 15న థియేటర్లు ఓపెన్ చేసుకోండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పి మూడు రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క నిర్మాత కూడా తమ సినిమా ఇప్పుడు విడుదల చేస్తానని చెప్పడం లేదు. అలా విడుదల చేస్తే కచ్చితంగా వాళ్లకు కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. అందుకే థియేటర్స్ ఓపెన్ చేస్తున్నా కూడా ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. అయినా సగం టికెట్లు అమ్ముకోండి అని ప్రభుత్వం పెట్టిన కండిషన్ ఏ నిర్మాత కూడా ఒప్పుకోడు. అందుకే ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. 

తెలుగులో ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఉప్పెన, సోలో బ్రతుకే సో బెటరూ, క్రాక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఒక్క నిర్మాత కూడా తమ సినిమా అక్టోబర్ 15 తర్వాత విడుదల చేస్తాం అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. దానికి కారణం అందరికీ తెలుసు. అసలే వైరస్ వెంటాడుతున్న సమయంలో కేవలం 50 శాతం టిక్కెట్లు అమ్ముకోవడం.. అలా వచ్చిన డబ్బులతో నిర్మాత బయటపడటం.. డిస్ట్రిబ్యూటర్ సంతోష పడడం అనేది జరగని పని. అది అసాధ్యం అని తెలుసు కాబట్టే ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. ఇప్పుడు కాకపోతే సంక్రాంతికి చూసుకుందాం.. ఫుల్ థియేటర్ నిండినప్పుడే సినిమా రిలీజ్ చేసుకుందాం అనుకొని సైలెంట్ అయిపోతున్నారు. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే నిర్మాతలంతా కలిసి థియేటర్స్ సొంతంగా మూసేయాలని నిర్ణయం తీసుకునేలా కనిపిస్తున్నారు. దానికి కారణం అనవసరంగా థియేటర్స్ తెరిచి వాటికి కరెంట్ బిల్లు, రెంటు కట్టడం వృధా అని వాళ్ళ అభిప్రాయం. కనీసం ఆ ఖర్చులు కూడా రానప్పుడు ఇంకెందుకు థియేటర్స్ తెరిచి ఉంచడం.. అందుకే ఇలాంటి నిర్ణయం వైపు నిర్మాతల అడుగులు పడుతున్నాయి. మరి ఇది ఇండస్ట్రీ భవిష్యత్తును ఎలాంటి మార్గం వైపు తీసుకువెళుతుందో చూడాలి. 

More Related Stories