English   

యాక్టింగ్ స్కూల్ కు వెళుతున్న ప్రభాస్ హీరోయిన్

Pooja Hegde
2020-10-05 11:03:52

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో పూజా హెగ్డే కూడా ఒకరు. మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం పూజా చేతిలో తెలుగులోనే మూడు సినిమాలు కూడా ఉన్నాయి. అయితే వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ పూజా కు ఈ మధ్య కొన్ని తిప్పలు వచ్చి పడ్డాయి. పూజా ఇతర భాషల్లో నటించడానికి రెడీ అవుతూ తెలుగులో నటించడానికి కొంత అలసత్వం ప్రదర్శిస్తోందట. దాంతో దర్శక నిర్మాతలు ఆమెపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు ఆమెకు నటన రావట్లేదు అని కూడా కొందరు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పూజా కమర్షియల్ హీరోయిన్ కావడం అందాలు అరబోయడంతోనే అవకాశాలను దక్కించుకుంటోందని టాక్ నడుస్తోంది. 

ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు సైతం  పూజ తన నటనను మెరుగుపర్చుకోవాలని చెప్పేస్తున్నారు. అయితే గతంలో తెలుగు ఇండస్ట్రీలో నటన కంటే గ్లామర్ వయ్యారాలు వలకబోసినవారికే ఎక్కువ అవకాశాలు ఉండేవి.. అలాంటివారినే ప్రేక్షకులు కూడా కోరుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడంలేదు. వైవిధ్యమైన పాత్రల్లో నటించేవారికే అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ విషయాలన్నీ గ్రహించిన పూజ గత కొన్ని రోజులుగా బెంగుళూరులోని ఓ యాక్టింగ్ స్కూలుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా డ్యాన్స్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ లో నటిస్తోంది.

More Related Stories