English   

షూటింగ్ కి రెడీ అయిన వకీల్ సాబ్..అప్పటినుండి షూటింగ్

  Vakeel Saab
2020-10-05 17:08:49

జనసేనాని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటిస్తోన్న తొలి చిత్రం 'వకీల్‌సాబ్‌'. బాలీవుడ్ చిత్రం 'పింక్' రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటికే పవన్‌కల్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

ఒక వైపు మహాత్మాగాంధీ ఫొటో, మరో వైపు అంబేద్కర్ ఫొటో మధ్య పవన్ లాయర్ గెటప్ లో కనిపిస్తారు. ఓ చేతిలో బేస్‌బాల్ స్టిక్‌, మరో చేతిలో క్రిమినల్ లా అనే పుస్తకం పట్టుకుని ఉన్న పవన్ లుక్ ప్రేక్షకులకు మరింత ఆసక్తిని పెంచింది. అయితే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా నేపథ్యంలో బ్రేక్ పడింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ నెల చివరి నుండి 15 రోజుల పాటు షూటింగ్ చెయ్యడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది. ఇక ఇప్పటికే థియేటర్ల ఓపెనింగ్బుకు కూడా అనుమతి రావడంతో తమ అభిమాన హీరో సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడడానికి పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

More Related Stories