English   

యూరప్ లో షూటింగ్ కు రెడీ అయిన రంగ్ దే టీం

 Nithiins Rang De
2020-10-05 17:16:42

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నబీ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. అయితే ఇదివరకే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించి హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలను కూడా పూర్తి చేశారు. కాగా సినిమాలోని పాటలను మరియు కొన్ని సన్నివేశాలను చిత్రబృందం ఫారెన్ దేశాల్లో చిత్రించాలని నిర్ణయం తీసుకుంది. కానీ కరోనా ఎఫెక్ట్ తో అన్ని దేశాల్లోనూ నిబంధనలు ఉండటం మరోవైపు కరోనా భయం ఉండటంతో దాదాపు అన్ని సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే రంగ్ దే చిత్రానికి కూడా బ్రేక్ పడింది. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో దర్శకులు షూటింగ్ లను ప్రారంభిస్తున్నారు. దాంతో రంగ్ దే షూటింగ్ కూడా ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 24 నుండి యూరప్ లో షూటింగ్ కు టీం రెడీ అవుతోంది. కాగా నితిన్ పెళ్లి తరవాత రాబోయే మొదటి సినిమా రంగ్ దే. దాంతో పెళ్లి తరవాత నితిన్ కెరీర్ ఎలా ఉండబోతోందో అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

More Related Stories