English   

ఆర్ఆర్ఆర్ నుండి రేపే అప్డేట్..

RRR
2020-10-05 19:28:06

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ మరియు ఇతర పరిశ్రమలకు చెందిన నటి,నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా సినిమా షూటింగ్ ను కొనసాగిస్తున్న క్రమంలో ఏడు నెలల క్రితం కరోనా రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవల కరోనా లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో షూటింగ్ లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారా.. సినిమా ఎప్పుడు విడుదల చేస్తారా.. అని అటు చరణ్ అభిమానులు ఇటు తారక్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు సోషల్ మీడియాలో ఇక ఆర్ఆర్ఆర్ వచ్చే జన్మలోనే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అలాంటి ట్రోల్స్ కు పులిస్టాప్ చెప్పేందుకు చిత్రబృందం రెడీ అయ్యింది. ఆర్ఆర్ఆర్ నుండి రేపు అప్డేట్ వస్తోందని టీమ్ స్పష్టం చేసింది. "మమ్మల్ని తిట్టడంలో మీ సృజనాత్మకత చాలు. మీ ప్రేమతో మమ్మల్ని ఉత్తేజ పర్చినందుకు ధన్యవాదాలు. సమయం గడిచిపోయింది. ఇక ఆ క్షణం వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మా వంతు. రెపటికోసం వేచి చూడండి" అంటూ యూనిట్ ప్రకటించింది. ఇక ఆర్ఆర్ఆర్ నుండి అప్డేట్ వస్తుందని ప్రకటించడంతోనే సోషల్ మీడియాలో సందడి మొదలైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కి సంబందించిన టీజర్ త్వరలోనే రబోతుందని సంబురపడుతున్నారు.

More Related Stories