English   

ఏపీలో థియేటర్ల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్

 Theaters
2020-10-06 07:38:02

కరోనా లాక్ డౌన్ తో అన్ని పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో అన్ని రకాల పరిశ్రమలు తెరుచుకున్నాయి. అయితే కరోనా కు భౌతిక దూరం ముక్యమైన విషయం కాబట్టి థియేటర్ల పరిశ్రమకు మాత్రం మొన్నటివరకు అనుమతి లభించలేదు. ఇక ఇటీవల కేంద్రం జారీచేసిన అన్ లాక్ 5 లో భాగంగా థియేటర్ల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే థియేటర్ల ఓపెనింగ్ కి అనుమతిచ్చినప్పటికి ఓ నిబంధన కూడా పెట్టింది. థియేటర్ లో కేవలం 50శాతం మాత్రమే సీటింగ్ కు అనుమతి ఉందని పేర్కొంది. దాంతో యజమానులు థియేటర్లు ఓపెన్ చెయ్యాలా లేదా అన్న ధైలమాలో పడ్డారు. ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర మార్గదర్శకాలను అనుగుణంగా ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. అక్టోబర్ 15 నుండి థియేటర్ల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆరునెలల కాలం తరువాత తిరిగి ఏపీలో థియేటర్లు తెరుచుకొనున్నాయి. ఇక 50 శాతం సీటింగ్ నిబంధన ఉండటంతో ఏపీలో థియేటర్లు ఓపెన్ చేస్తారా..చేస్తే కలెక్షన్లు జరుగుతాయా అన్నది చూడాలి.

More Related Stories