English   

పవన్ కు జెడ్ కేటగిరీ భద్రత..క్లారిటీ ఇచ్చిన జనసేన

Janasena
2020-10-06 08:03:03

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఒడిపోయినప్పటికి పవన్ తన రెండు రాష్ట్రాల్లో తన పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీ బిజేపీ తో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఏపీలో వరుసగా దేవలయాలపై జరుగుతున్న దాడులపై పవన్ బీజేపీ తో కలిసి తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ విస్తృత స్థాయిలో పర్యటిస్తున్నారని బీజేపీ తో పొత్తు ఉండటం కారణంగా ఆయనకు కేంద్రం జెడ్ సెక్యూరిటీని ఏర్పాటు చేసిందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. జెడ్ సెక్యూరిటీ కల్పిస్తే పవన్ కు 22 మంది ప్రైవేట్ సెక్యూరిటీ తో పాటు నలుగురు ఎన్ఎస్జి కమాండోలు రక్షణ కల్పించాలి. అయితే ఇలా వస్తున్న పుకార్లను జనసేన కార్యాలయం కొట్టిపారేసింది. "పవన్ కళ్యాణ్ కు జెడ్ సెక్యూరిటీ కల్పించారనే వార్తల్లో నిజం లేదు. జెడ్ సెక్యూరిటీ భద్రతపై మమ్మల్ని ఎవరూ కాంటాక్ట్ అవ్వలేదు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు" అని జనసేన కార్యాలయం స్పష్టం చేసింది.

More Related Stories