English   

సంజయ్ దత్ ఫోటో వైరల్..ఆందోళనలో ఫ్యాన్స్

sanjay dutt
2020-10-06 08:09:24

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ అవ్వడంతో ఆయన షూటింగ్ లకు బ్రేక్ చెప్పి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా సంజయ్ దత్ ఫోటోబోకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫొటోలో సంజయ్ చాలా సన్నగా , వీక్ గా కనిపిస్తున్నారు. ఇటీవలే కేజీఎఫ్ 2 లో సంజయ్ లుక్ చూసిన అభిమానులు ప్రస్తుతం సంజయ్ దత్ ను చూసి షాక్ అవుతున్నారు. తమ అభిమాన హీరో అనారోగ్యం బారిన పడటంతో ఆందోళన చెందుతున్నారు. నాలుగోదశ క్యాన్సర్ తో బాధపఫుతున్న సంజయ్ ముంబై లో కీమో తెరఫీ చేయించుకున్నారు. కీమో తెరఫీ చేసుకున్న అనంతరం సంజయ్ తన భార్య, పిల్లలతో కలిసి ఇన్నిరోజులు దుబాయ్ లో ఉన్నారు. కాగా ఈరోజు ఆయన తిరిగి ముంబై చేరుకున్నారు. త్వరలోనే సంజయ్ కి రెండో దశ కీమో తెరఫీ చేయనున్నట్టు సమాచారం. సంజాయ్ దత్ బాలీవుడ్ నటుడు అయినప్పటికీ ఆయనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. తమ అభిమాన నటుడు త్వరగా క్యాన్సర్ ను జయించి సినిమాలు చేయాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

More Related Stories