English   

ఖలేజాకు పదేళ్లు..సేమ్ కాంబినేషన్ తో ముందుకోస్తాం మహేష్ క్లారిటీ

Khaleja.jpg
2020-10-07 14:41:00

కొన్ని సినిమాలు హిట్ అవ్వకపోయినప్పటికీ ప్రేక్షకుల మదిలో మాత్రం నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో మహేష్ బాబు సినిమాగా వచ్చిన ఖలేజా కూడా ఒకటి. ఈ సినిమా డిఫరెంట్ కథతో తెరకెక్కడంతో కొంతమందికి నచ్చినప్పటికి హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను రీచ్ అవ్వలేదు. కాగా ఈ సినిమా వచ్చి నేటికి 10 ఏళ్ళు పూర్తయ్యింది. దాంతో మహేష్ సినిమాను గుర్తు చేసుకొని ఓ ట్వీట్ చేసారు.

"ఖలేజా కు 10 ఏళ్ళు..నటుడిగా నన్ను కొత్తగా ఆవిష్కరించిన సినిమా. ఎప్పటికీ నాకు ఈ సినిమా ప్రత్యేకమే.. నా బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ మా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. త్వరలోనే" అంటూ మహేష్ ఖలేజా షూటింగ్ టైం లో వీడియోను పోస్ట్ చేసారు. దాంతో మహేష్ త్రివిక్రమ్ కమినేషన్ లో మరో సినిమా రాబోతోందని మహేష్ హింట్ ఇచ్చారు. ఇక మహేష్-త్రివిక్రమ్  కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలియడంతో ప్రిన్స్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా ఖలేజా సినిమాలో మహేష్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది. సినిమాలో మంచి కామెడీ, మరియు డైలాగ్ లు ఉన్నప్పటికీ హీరో దేవుడు అనేసరికి ప్రేక్షకులు కొంత కన్ఫ్యూజ్ అవ్వడంతో మాత్రమే సినిమా అడలేకపోయింది.

More Related Stories