English   

డ్రగ్స్ కేసు..రియాకు బెయిల్ కానీ

Rhea Chakraborty.jpg
2020-10-07 15:10:20

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ జరపగా డ్రగ్స్ కోణం భయటపడింది. సుశాంత్ ప్రేయసి రియచక్రవర్తి ఆమె సోదరుడు షౌమిక్ చక్రవర్తికి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు దాంతో ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక రియా విచారణలో  బాలీవుడ్ పరిశ్రమకు చెందిన దీపికా పదుకునే, శ్రద్ధకపూర్, సారా అలీఖాన్, రకుల్ పేర్లు చెప్పడంతో వారిని కూడా ఎన్సీ బి అధికారులు విచారించారు.

ఇదిలా ఉండగా రియా చక్రవర్తి  ఈ కేసులో శిక్ష అనుభవిస్తుండగా పలుమార్లు బెయిల్ కావాలని అభ్యర్థించుకుంది. సెప్టెంబర్ 8 నుండి రియా జైల్లోనే శిక్షను అనుభవిస్తుంది. కాగా సెప్టెంబర్ 30 న ఇరువర్గాల వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. అంతే కాకుండా బెయిల్ మంజూరు చేయకూడదని ఎన్సీబీ కోర్టుకు తెలిపింది. రియాకు బెయిల్ ఇస్తే విచారణ కు ఆటంకం కలిగే అవకాశం ఉందని విన్నవించుకుంది.

డ్రగ్స్ కేసులో రియా హస్తం ఉందని ఆమె సోదరుడు డ్రగ్స్ సరఫరా చేసినట్టు నిర్ధారణ అయ్యిందని ఇది తీవ్రమైన నేరమని ఎన్సీబి తెలిపింది. కాగా ఇరువురి వాదనలు విన్న కోర్టు రియాకు కండిషన్స్ తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆమె సోదరుడికి బెయిల్ ఇవ్వలేదు. అంతే కాకుండా రియా లక్షరూపాయలు పూచీకత్తు ఇవ్వాలని పేర్కొంది. రియా ప్రతినెల 30వ తరీఖున పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని ఆదేశించింది. ముంబై ను విడిచి ఆమె ఎక్కడికీ వెళ్లకూడదని నిబంధన పెట్టింది.

More Related Stories