English   

కంగనా పై నెటిజన్లు ఫైర్..హత్రస్ ఘటన మీకు కనిపించలేదా

Kangana Ranaut trolling.jpg
2020-10-07 15:29:39

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా కంగనాకు మంచి పేరు ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో కనిపిస్తుంది. కంగనా చేసిన సినిమాలు తక్కువ అయినప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలతో అభిమానులను మరియు శత్రువులను సంపాదించుకుంది. ఇక ఇటీవల సుశాంత్ ఆత్మహత్య కేసు పై స్పందించిన కంగనా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సుశాంత్ ఇండస్ట్రీ లో నెపోటిజం కరణంగానే మరణించాడని, ఇండస్ట్రీలోని కొంతమంది వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని విరుచుకుపడింది. అంతే కాకుండా ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అక్కడితో ఆగకుండా కంగనా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం పై కూడా నిప్పులు పోసింది. ముంబై లో ఉన్న కంగనా ఆఫీస్ ను ప్రభుత్వం అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి నే ఆమె శపించింది. దాంతో కంగనా వ్యాఖ్యలను రాజకీయంగా వాడుకోవాలని చూసిన బీజేపి ఆమెకు వత్తాసు పలికింది. కంగనా కు సపోర్ట్ చేస్తూ బిజెపి ఎమ్మెల్యేలు కామెంట్లు కూడా చేసారు.

ఇదిలా ఉండగా ఎలాంటి చిన్న ఘటన జరిగినా స్పందించే కంగన తాజాగా యూపీ లోని హత్రస్ లో ఓ దళిత యువతిని అత్యంత దారుణంగా హత్యాచారం చేసిన ఘటనపై స్పందించకపోవడం విశేషం.

దాంతో కంగనా పై నెటిజన్లు మండిపడుతున్నారు. హత్రస్ ఘటన కంగన దృష్టికి రాలేదా? వచ్చినా అక్కడ ఆమె మిత్ర పార్టీ బీజేపీ అధికారంలో ఉందని స్పందించడం లేదా.? అంటూ ప్రశ్నిస్తున్నారు.

More Related Stories