English   

బిగ్ బాస్ : గంగవ్వ ఆటలో అరటిపండు అయ్యిందా...

Gangavva.jpg
2020-10-07 16:47:38

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మంచి రేటింగ్ తో కొనసాగుతోంది. మొదట్లో షో లో పరిచయం ఉన్న కంటెస్టెంట్స్ లేకపోవడం అన్నీ కొత్త ముఖాలు కావడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ సారి బిగ్ బాస్ బిస్కెట్ అయ్యిందని ఫీల్ అయిపోయారు. అయతే షో లో గ్లామర్ ఎక్కువ ఉండటం, అంతే కాకుండా ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, కొట్లాటలు భాగా కనిపించడంతో బిగ్ బాస్ బండి పికప్ అందుకుంది. షో పై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగి షో రేటింగ్ కూడా భారీగా పెరిగిపోయింది.

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు అప్పుడే అభిమానులు కూడా పెరిగిపోయారు. ముఖ్యంగా షో లో ఎక్కువ గొడవ పడుతున్న అభిజిత్, అఖిల్ కు అభిమానులు ఎక్కువయ్యారు. మీడియాలో వీళ్ళిద్దరిపైనే పోటీ నడుస్తోంది. ఇక మోనాల్ ఇద్దరితో క్లోజ్ గా ఉండటంతో వీళ్ళ టాపిక్ హాట్ టాపిక్ అవుతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి సింపతీ తో నెట్టుకొస్తున్నాడు. ఇక అదే వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన అవినాష్ హౌస్ మెంబెర్స్ తో కలిసిపోయి హౌస్ లో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఇక దివి, హారిక, నోయల్, లాస్య అప్పుడప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఆటను కొనసాగిస్తున్నారు. మెహబూబ్, సోహెల్ ఫ్రెండ్ షిప్ లో కొంత కామెడీ మరియు  సోహెల్ కోపం ప్రేక్షకులకు కొంత వినోదాన్ని పంచుతున్నాయి. ఇక సుజాత, అమ్మా రాజశేఖర్ పై మాత్రం ప్రేక్షకులు కోపంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అమ్మా రాజశేఖర్ సేఫ్ గేమ్, సుజాత బిట్టు అనడం నవ్వడం పై ట్రోల్స్ జరిగుతున్నాయి. ఇదిలా ఉండగా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ తో ఫేమస్  అయ్యి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. అయితే గంగవ్వ వచ్చిన మొదటి వారం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

హౌస్ మేట్స్ కూడా ఆమెను తెగ పట్టించుకున్నారు. కానీ రెండు వారాల నుండి మాత్రం గంగవ్వకు పెద్దగా స్క్రీన్ స్పేస్ ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే బిగ్ బాస్ లో ఉండే టాస్కుల్లో ఆమె వయస్సు కారణంగా పాల్గొనలేదు. దాంతో ఆమె కనిపించకపోవచ్చు. పోనీ నామినేషన్స్ అప్పుడు గంగవ్వను ఎవరైనా నామినేట్ చేస్తారా .. అన్న భయంతో చేయలేరు. దాంతో గంగవ్వ అటు టాస్కుల్లో..ఇటు నామినేషన్స్ లో పెద్దగా కనిపించదు. దాంతో ప్రేక్షకులు కూడా గంగవ్వ ఆటలో అరటిపండులా అయ్యిందని బయటికి వస్తేనే బెటర్ ఏమో అని అనుకుంటున్నారు.

More Related Stories