English   

అమితాబ్ షో లో తెలంగాణ టీచర్

Kaun Banega Crorepati.jpg
2020-10-07 17:35:54

అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం టెలివిజన్ రంగంలో ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం సీజన్ 12 నడుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా పేరు ఉన్న ఈ ప్రోగ్రామ్ లో తెలంగాణ నుండెజ్ మొదటి సరిగా ఓ వ్యక్తి పాల్గొంటున్నారు. ఆవిడే టీచర్ సబితా రెడ్డి. హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సబిత టీచర్ గా పని చేస్తున్నారు.

కాగా ఆమె షో లో పాల్గొన్న సందర్భంలో ఆమె లైఫ్ జర్నీ తెలుసుకున్న అమితాబ్ ఆశ్చర్యపోయారు. భర్తను కోల్పోయిన సబిత పిల్లలను పెంచి పెద్ద చేయడంపై అమితాబ్ ఆమెను ప్రశంసించారు. ఒక టీచర్ గా ఆమె పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా విద్యను అందించాలని పేర్కొన్నారు.

ఆమె జీవితం స్ఫూర్తి దాయకం అని అమితాబ్ ఆమెను కొనియాడారు. ఈ ప్రోగ్రాం లో సబిత తో పాటు ఏడుగురు కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. కాగా ప్రదీప్ అనే  కంటెస్టెంట్ అమితాబ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి 12 లక్షలు గెలుచుకున్నారు. ఆయన 12 లక్షలు తీసుకుని డ్రాప్ అయ్యారు.

ఇక ప్రదీప్ తరవాత సబిత పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆమె తో పాటు ఆమె కొడుకు, కూతురు కూడా వచ్చారు. ఇక సబిత పాల్గొన్న ఎపిసోడ్ సోనీ టీవీలో మంగళవారం రాత్రి ప్రసారం అవుతుంది.

More Related Stories