English   

కాజల్ పెళ్ళి డేట్ ఫిక్స్

Kajal Wedding Date
2020-10-08 09:36:05

తన అందం, అభినయంతో ప్రేక్షకులకు కట్టిపడేసిన చందమామ కాజల్ పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే కాజల్ ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోనుందని వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా కాజల్ తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. కొద్ది సేపటి క్రితం కాజల్ ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. "నేను ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30న పెళ్లి చేసుకుంటున్నా. మా ఇద్దరి కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాయి. అలానే మా ఇద్దరి కుటుంబాలు కూడా బాగా కలిసిపోయాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై లో పరిమిత అతిధుల మధ్య తమ వివాహం జరుగుతుందని, కాబట్టి ప్రేక్షకులు, అభిమానుల ఆశీస్సులు కావాలి" అంటూ కాజల్ పేర్కొంది. 

ఇదిలా ఉండగా కాజల్ లక్ష్మికళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తరవాత కృష్ణవంశీ దర్శకత్వంలో చందమామ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తరవాత రాజమౌళి దర్శకత్వంలో "మగధీర" సినిమాతో కాజల్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. మగధీర తరవాత ఈ భామ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. అంతేకాకుండా కాజల్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆచార్య, భారతీయుడు 2, మోసగాళ్ళు, ముంబై సాగ సినిమాల్లో నటిస్తోంది.

More Related Stories