English   

ఎమ్మెల్యే పై కృతిసనన్ ఫైర్..ఆయన వ్యాఖ్యలు ఇబ్బందికరం

Kriti Sanon
2020-10-08 09:50:32

యూపీలోని హత్రస్ లో దళిత యువతిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దళిత యువతిని నిందితులు రేప్ చేసి దారుణంగా హత్య చేశారు. అయితే కొంతమంది నాయకులు ఈ ఘటనను వ్యతిరేకించకుండా అమ్మాయిలపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ బీజేపీ ఎమ్మెల్యే హత్రస్ ఘటన పై స్పందిస్తూ..."మంచి విలువలు, సంస్కారం తో సమాజంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చేయవచ్చు. తల్లిదండ్రులు తమ కుమార్తెలు సంస్కారం నేర్పించాలి. ప్రభుత్వాలు కేవలం రక్షణ మాత్రమే కల్పిస్తాయి" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

కాగా తాజాగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ కృతిసనన్ ఫైర్ అయ్యింది. అసలు ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడో అతడికైనా అర్ధం అవుతుందా అని వ్యాఖ్యానించింది. ఆయన ఏం చెప్పారో ఎవరికైనా అర్థం అయ్యిందా? అంటూ ప్రశ్నించింది. ముందు అలాంటి మనస్తత్వాలు మార్చుకోవాలంటూ మండి పడింది. ఆయన వ్యాఖ్యలు ఇబ్బందికరంగబున్నాయని...అసలు తల్లిదండ్రులు అబ్బాయిలకు సంస్కారం నేర్పించాలని పేర్కొంది. అయితే ఎప్పుడూ కూల్ గా ఉండే కృతిసనన్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పై ఫైర్ అవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. ఇదిలా ఉండగా కృతి బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. తెలుగులో మొదట కృతి మహేష్ సినిమాలో నటించి మార్కులు కొట్టేసింది. అంతే కాకుండా ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో ఈ భామ నటిస్తూ బిజీగా వుంది.

More Related Stories