English   

సాయి ధరమ్ తేజ్‌పై దుష్ప్రచారం.. అనారోగ్యం, పెళ్లి అంటూ పుకార్లు.. 

Hero Sai Dharam Tej
2020-10-08 10:39:42

అసలే ఈ రోజుల్లో ఎవరెప్పుడు అనారోగ్యం పాలవుతున్నారనేది అర్థం కావడం లేదు. అందుకే ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా కూడా భయపడుతున్నారు అభిమానులు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. నిన్నమొన్నటి వరకు చాలా బాగున్న ఈయనకు ఇప్పుడు అనారోగ్యం అంటూ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తలు చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. పైగా కరోనా కాలం కూడా కావడంతో అది నిజమే అని కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. అయితే మెగా అభిమానులతో పాటు అందరికీ సాయి సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. అసలు తమ హీరోకు ఏం కాలేదని చెప్తున్నారు వాళ్లు. `సోలో బ్రతుకే సో బెటరు` సినిమా డబ్బింగ్ వాయి పడటానికి సాయి అనారోగ్యమే కారణమంటూ వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమే అంటున్నారు వాళ్లు. అందులో ఎలాంటి నిజం లేదని.. అనవసరంగా అభిమానులను కంగారు పెట్టే అబద్ధపు వార్తలు రాయొద్దంటూ కోరుతున్నారు.

చిత్ర యూనిట్‌తో కొన్ని గంటల ముందు వరకు కూడా సాయి పార్టీ చేసుకున్నాడని.. అలాంటి వ్యక్తికి అనారోగ్యం అంటూ పుకార్లు పుట్టించొద్దని వాళ్లు వార్నింగ్ ఇస్తున్నారు. సోలో బ్రతుకే సో బెటరూతో పాటు దేవా కట్టా సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు ఈయన. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఈయన చేతిలో ఉన్నాయి. అనారోగ్యం అనే వార్తతో పాటు పెళ్లి కూడా పుకారు అంటున్నారు వాళ్లు. కావాలనే కొందరు తమ హీరోపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సాయి ధరమ్ తేజ్ వర్గం కూడా చెబుతున్న మాట. ముందు నుంచి కూడా మెగా మేనల్లుడిని ఓ వర్గం టార్గెట్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఆయన కెరీర్ తో పాటు ఇప్పుడు పర్సనల్ లైఫ్ ను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు వాళ్లు అంటూ సాయి వర్గం ఆరోపిస్తుంది. ఏదేమైనా కూడా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అబద్ధమే అని వాళ్లు అయితే తేల్చేసారు. 

More Related Stories