English   

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ తమ్ముడు హఠాన్మరణం.. 

Ajay Devgn
2020-10-08 11:09:18

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో లెక్కకు మించి విషాదాలు జరుగుతున్నాయి. అసలు ఈ 2020 ఎందుకొచ్చిందిరా బాబూ అంటూ అంతా తల పట్టుకుని కూర్చుంటున్నారు. తెలుగు, హిందీ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా మృత్యుకేళి నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇదే కొనసాగింది. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈయన తమ్ముడు అనిల్ దేవ్ గణ్ హఠాన్మరణం చెందాడు. ఈయన కేవలం అజయ్ తమ్ముడు మాత్రమే కాదు దర్శకుడు కూడా. 2020 అక్టోబర్ 5న అనిల్ దేవ్‌గణ్ తుదిశ్వాస విడిచారు. తన తమ్ముడి మరణవార్తను అజయ్ దేవ్‌గణ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. అజయ్ బాబాయ్ ప్రేమ్ ప్రకాష్ దేవ్‌గణ్ కుమారుడే ఈ అనిల్ దేవ్‌గణ్. అజయ్ దేవ్‌గణ్‌కు ఈయన సొంత తమ్ముడు కాదు.. కజిన్. 45 ఏళ్ల వయసులోనే అనిల్ దేవ్‌గణ్ కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అనిల్ మరణంతో తమ గుండె పగిలినంత పని అయిపోయిందంటూ చెప్పుకొచ్చాడు అజయ్. 

ఇదే విషయంలో ట్వీట్ చేసిన అజయ్ అనిల్ దేవ్‌గణ్.. నేను గత రాత్రి నా సోదరుడు అనిల్ దేవ్‌గణ్‌ను కోల్పోయాను.. అతడి అకాల మరణం మా కుటుంబాన్ని హృదయ విదారకంగా మార్చేసింది.. ADFF & నేను అతని ఉనికిని ఎంతో కోల్పోతాము.. అతని ఆత్మ కోసం ప్రార్థించండి.. కరోనా మహమ్మారి కారణంగా సంతాప సభ ఏర్పాటు చేయలేకపోతున్నాం.. అంటూ రాసుకొచ్చాడు. అజయ్ ఈ వార్త పోస్ట్ చేసిన వెంటనే అభిమానులు, సన్నిహితులు సంతాపం తెలియజేసారు. అనిల్ దేవగణ్ మరణానికి అభిషేక్ బచ్చన్, కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా సంతాపం తెలిపారు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన రాజు చాచా, బ్లాక్ మెయిల్ సినిమాలను అనిల్ తెరకెక్కించాడు. దానికంటే ముందు 1996 లో వచ్చిన జీత్ సినిమాకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు. అదే ఈయనకు మొదటి సినిమా కూడా. 2012లో విడుదలైన మర్యాద రామన్న రీమేక్ సన్ ఆఫ్ సర్దార్ సినిమాకు అనిల్ క్రియేటివ్ డైరెక్టర్‌గా వర్క్ చేసాడు. ఈయన మరణం బాలీవుడ్ ప్రముఖులను విషాదంలో ముంచేసింది. 

More Related Stories