English   

మోనాల్‌, అఖిల్, అభిజీత్ ప్రేమకథతో బిగ్ బాస్ రేటింగ్స్ అదుర్స్.. 

Bigg Boss Telugu 4
2020-10-08 11:17:42

బిగ్ బాస్ సీజన్ మొదలైన ప్రతీసారి కూడా ఇంట్లో కొన్ని జంటలు అలా ఫిక్స్ అయిపోతాయి. వాళ్లేం చేసినా కూడా ఆడియన్స్ ఆసక్తిగా చూస్తుంటారు. నిజంగానే వాళ్లు పెళ్లి కానీ చేసుకుంటారా అనే రేంజ్ లో అక్కడ ప్రేమలు కురిపిస్తూ ఉంటారు. తొలి సీజన్ మినహాయిస్తే రెండో సీజన్ లో తనీష్, దీప్తి సునైనా నడిపించారు.. మూడో సీజన్ లో అయితే పున్ను, రాహుల్ సిప్లిగంజ్ మధ్య కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ 4 తెలుగులో ముగ్గురి మధ్య కావాల్సినంత డ్రామా జరుగుతుంది. వాళ్లే అభిజీత్, అఖిల్, మోనాల్. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా అఖిల్, అభిజీత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. అది చూసిన తర్వాత అంతా షాక్ అయ్యారు కూడా. పైగా మోనాల్ కోసం గొడవ పడటంతో మరింత ఆసక్తికరంగా మారింది. మోనాల్‌కు ఆ రోజు నువ్వు వేలు చూపించి మాట్లాడినవ్ అంటూ అభిపై అఖిల్ ఫైర్ అయ్యాడు. పైగా ఐ లైక్ యూ అంటే దాన్ని నువ్వు మరోలా ప్రొజెక్ట్ చేస్తున్నావ్.. అది బయటికి ఎలా వెళ్తుంది.. ఓ అమ్మాయి గురించి అలా చెప్తే ఎలా అంటూ అభిజీత్‌ను టార్గెట్ చేసాడు అఖిల్. 

మరోవైపు అభి కూడా అంతే సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. ఆ అమ్మాయితో మాట్లాడితే నీకేంటి.. అయినా మోనాల్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావ్.. మా ఇద్దరి మధ్య ఏమైనా సమస్య ఉంటే మేం తేల్చుకుంటాం.. మధ్యలో నువ్వెవరు బ్రదర్ అంటూ రెచ్చిపోయాడు. ఈ ఇద్దరూ తన గురించి గొడవ పడుతుంటే మోనాల్ మాత్రం వెక్కి వెక్కి ఏడ్చేసింది. తన పేరు అనవసరంగా తీసి ఇబ్బంది పెట్టొద్దని.. తన పరువు తీయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. నేషనల్ ఛానెల్‌లో వచ్చే కార్యక్రమం కాబట్టి తన పరువు పోతుందని ఆమె సీరియస్ అయింది. ఇద్దరూ తనకు మంచి మిత్రులే అని.. ఇద్దరూ అంటే యిష్టమంటూ చెప్పుకొచ్చింది మోనాల్. ఈ క్రమంలోనే నామినేషన్ తర్వాత మళ్లీ కూర్చుని మాట్లాడుకున్నారు. అయితే ముగ్గురూ కలిసి మాత్రం కాదు.. అఖిల్ ఓ సారి వెళ్లి మోనాల్‌తో జరిగిన విషయాన్ని చెప్పాడు.. అసలేం జరిగింది.. తను అక్కడ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో మోనాల్‌కు వివరించాడు. 

తనకు మాట్లాడాలంటే చాలా టాపిక్స్ ఉన్నా కూడా తన గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనేది పాయింట్ చెప్పడానికి ప్రయత్నించాడు అఖిల్. మరోవైపు అభిజీత్ కూడా ఇదే చేసాడు. మోనాల్ దగ్గర కూర్చుని ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసాడు. నీ టాపిక్ నేను తీసుకురాలేదు.. అఖిల్ తీసుకొచ్చాడంటూ చెప్పాడు అభిజీత్. చివర్లో సారీ చెప్పాడు. మరోవైపు అఖిల్ కూడా క్షమించమని కోరాడు. అందులో అఖిల్‌ను మోనాల్ కౌగిలించుకుంది కూడా. మరోవైపు మోనాల్ ఏడుస్తుంటే కన్నీరు తుడిచాడు అభిజీత్. మొత్తానికి ఈ ముగ్గురి ప్రేమకథతో కావాల్సినంత మసాలా వస్తుంది బిగ్ బాస్ షోకు. 

More Related Stories