షూటింగ్ లో ప్రమాదం..యువ నటుడికి సీరియస్

ప్రముఖ మలయాళ నటుడు టోవినో థామస్ కు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన కాలా అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో థామస్ తీవ్రంగా గాయపడ్డారు. ఓ యాక్షన్ సీన్ చిత్రిస్తుండగా థామస్ కు యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని కొచ్చిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే థామస్ కు బలమైన గాయం తగలడంతో ఆయన కడుపులో బ్లీడింగ్ జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. థామస్ కు ప్రమాదం జరిగిన వార్త భయటకు రావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉండగా థామస్ మాలీవుడ్ లో హీరో తో పాటు విలన్ పాత్రల్లోనూ నటించి మెప్పించారు. ఆయన నటించిన ఫోరెన్సిక్ వెబ్ సిరీస్ తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ఫోరెన్సిక్ వెబ్ సిరీస్ తెలుగులో ఆహా యాప్ లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.