English   

సుధీర్ బాబు భార్య బర్త్ డే...బావ మహేష్ కు దావత్

 Mahesh Babu
2020-10-08 13:44:47

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు హీరో సుధీర్ బాబు బావా బావమర్థులు అన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. కాగా సుధీర్ హీరోతో పాటూ విలన్ పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరూ బర్త్ డే పార్టీలో సందడి చేశారు. బుధవారం సుధీర్ బాబు భార్య మహేష్ చెల్లెలి పుట్టినరోజు కావడంతో అంతా కలిసి ఒకే చోట డిన్నర్ చేశారు. డిన్నర్ లో మహేష్ భార్య నమ్రత కూడా పాల్గొన్నారు. కాగా ఈ విషయాన్ని సుధీర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దాంతో మహేష్ డిన్నర్ లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా మహేష్ ఫ్యామిలీ తో తప్ప ఇతర పార్టీలలలో కానీ ఎక్కడా కానీ కనిపించరు. ఒకవేళ ఏవైనా ఫంక్షన్స్ కు వెళ్లినా పక్కన నమ్రత ఉండాల్సిందే. దాంతో మహేష్ బాబు ఎంత ఫ్యామిలీ పర్సన్ అని స్పష్టంగా తెలిసి పోతుంది. చాలా మంది మహేష్ అభిమానులు కూడా మహేష్ లోని ఈ క్యారెక్టర్ ను చాలా మెచ్చుకుంటారు.

More Related Stories