English   

తెలంగాణలో థియేటర్ల ఓపెనింగ్ మరింత ఆలస్యం

 Telangana
2020-10-08 17:54:16

కరోనా లాక్ డౌన్ తరవాత కేంద్రం అన్ లాక్ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఒక్కో రంగానికి అనుమతిస్తూ తిరిగి ఆర్ధికంగా నిలదొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇటీవల అన్ లాక్ 5 మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ సారి మార్గదర్శకాల్లో థియేటర్లకు, ఎంటర్ టైన్మెంయ్ పార్కులకు, సూళ్లకు అనుమతిచ్చింది. దాంతో కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రంలో స్కూళ్లు, థియేటర్ల ఓపెనింగ్ పై క్లారిటీని ఇస్తున్నాయి. థియేటర్లు, మల్టీ ప్లెక్సుల్లో 50 శాతం సీటింగ్ అనుమతితో తెరుచుకోవలని చెప్పడంతో నిర్వాహకులు సైతం సందగ్ధం లో ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం థియేటర్లు, స్కూళ్లు ఓపెనింగ్ పై ఇంకా ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. అంతే కాకుండా థియేటర్ల ఓపెనింగ్ కు ఇప్పుడే అనుమతిచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుంది. దాంతో స్కూళ్లు, థియేటర్లకు అనుమతిచ్చి రిస్క్ ఎందుకు తీలుకోవడం అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 

మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేసారు. అన్ లాక్ 5 మార్గదర్శకాలను జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం కాలేజీలు, స్కూళ్లు, థియేటర్ల పై మాత్రం ప్రస్తావించలేదు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తామన్నది కూడా చెప్పలేదు. దాంతో అసలు ఇప్పట్లో తెరుస్తారా లేదా అన్నది కూడా ప్రశ్నర్థకంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా విజరంభన తగ్గుముఖం పట్టిందట ఈ నేపథ్యంలో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవసరమా అని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కనిపిస్తుంది. అంతే కాకుండా థియేటర్లు ఓపెన్ చేసినా జనాలు వస్తారా.? మరోవైపు ఓపెన్ చేసిన వెంటనే సినిమాలు కూడా రీలీజ్ కు లేవని..దాంతో తెరిచినా ప్రయోజనం ఏంటని ప్రశ్న మొదలైంది. అయితే ఈ విషయంలో పునరాలోచనలో పడిన ప్రభుత్వం స్కూళ్లు, సినిమా హాళ్లు ఓపెన్ చేస్తుందా లేదా చూడాలి.

More Related Stories