English   

బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన చందమామ

Kajal Agarwal
2020-10-08 17:59:53

అందాల చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. కాజల్ తాను ఓ బిసినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు ఈ కొత్తజంట ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా కాజల్ తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. పార్టీలో కాజల్ బ్లాక్ డ్రెస్ తో ఆకట్టుకుంది. బ్రైడ్ టూ బీ అని రాసి ఉన్న సాష్ ను ధరించి ఉన్న కాజూ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కాజల్ కు ఆమె అభిమానులు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక కాజల్ పెళ్లి అక్టోబర్ 30న ముంబై లో జరగనుంది. కరోనా నేపథ్యంలో కేవలం కొద్దీ మంది అతిథుల సమక్షంలోనే తమ పెళ్లి జరుగుతుందని కాజల్ తెలిపింది. ఇదిలా ఉండగా పెళ్లి తరవాత కూడా ఈ భామ నటనను కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కాజల్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా వుంది . తెలుగులో చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమాలో కాజల్ నటిస్తోంది. అంతే కాకుండా కమల్ హసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 సినిమాలోనే ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది

More Related Stories