వీడియో కాల్ లో బట్టలు విప్పామన్నాడు..చిన్మయి సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సింగర్ చిన్మయి మరోసారి సంచలన కామెంట్లు చేసింది. ఇదివరకు చిన్మయి మీటూ అంటూ కోలీవుడ్ పరిశ్రమలో కొందరిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కార్తీక్ , వైరముత్తు, కైలాష్ కేర్ లపై ఆరోపణలు చేసింది. దాంతో ఆమెను కోలీవుడ్ కు దూరం చేశారు. కాగా తాజాగా చిన్మయి సోఫియా అక్కర అనే సింగర్ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని చిన్మయికి చెప్పిందని పోస్ట్ చేసింది. సోఫియా చెప్పిన కథనం ప్రకారం....నాకు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు ఓ ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ ను కలిసే అవకాశం దక్కింది. నేను ఆయనకు ప్లే బ్యాక్ సింగర్ గా చేసాను. ఆయన టాలెంట్ ని ఆరాధించేదానిని. అయితే ఒకరోజు ఆయన నా స్కైప్ ఐడి అడిగారు. దాంతో చాలా సంతోషపడ్డాను. కానీ ఒక్క వీడియో కాల్ తో ఆయనపై ఉన్న గౌరవం మొత్తం పోయింది. కెమెరా ముందు మొత్తం బట్టలు తీసేసి నన్ను నగ్నంగా ఉండమన్నాడు. దాంతో నేను షాక్ అయ్యాను. మీడియాకు చెబుతాను అని చెప్పినా ఆయన కొంచం కూడా భయపడలేదు. నువ్వు చెప్పినావాళ్ళు నమ్మరు అని అన్నాడు. ఈ విషయాన్ని సోఫియా చెప్పినట్లు చిన్మయి పేర్కొంది. ఈ ఘటన తన కళ్లు తెరిపించిందని...ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతాయని నన్ను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఘటన అని వెల్లడించింది. ఇదిలా ఉండగా చిన్మయి శ్రీపాద హీరో రాహుల్ ను వివాహం చేసుకుంది. ఆమె తెలుగు తో పాటు ఇతర భాషల్లో పాటలు పాడుతూ బిజీ గా ఉంది.