English   

పొలాల్లో టక్ జగదీష్ సందడి

Nani
2020-10-08 18:13:33

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా టక్ జగదీష్. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ స్వరాలు అందిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారిపాటి, పెద్ది  హరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  కాగా లాక్ డౌన్ సమయంలో బ్రేక్ పడిన ఈ సినిమా షూటింగ్ గురువారం తిరిగి ప్రారంభమయ్యింది. షూటింగ్ పొలాల్లో జరుగుతుంది. షూటింగ్ స్పాట్ లో నాని నైట్ ఎఫెక్ట్ లో కనిపిస్తున్నాడు. ఈ సన్నివేశంలో అతడితో పాటు మరికొందరు నటీనటులు కూడా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా నాని షూటింగ్ ప్రారంభమైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. జగదీష్ జాయిన్ అయ్యాడు..టక్ మొదలైంది అంటూ పేర్కొన్నాడు. కాగా నాని కి ఇది హీరోగా 26వ సినిమా..ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని నాని ఆశలు పెట్టుకున్నాడు. సినిమాలో నాని సరసన రీతూ వర్మ మరియు ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇక నాని-శివ నిర్వణ కాంబినేషన్ లో వచ్చిన నిన్ను కోరి సినిమా సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇక ఈ సారి కూడా ఈ కాంబినేషన్ మరో హిట్ కొడుతుందని నాని అభిమానులు అనుకుంటున్నారు.

More Related Stories