English   

క్రిష్ సినిమా నుండి ఆసక్తికర అప్డేట్

 Rana Daggubati
2020-10-09 08:36:25

విభిన్న సినిమాలు తియ్యడంలో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ కు మంచి గుర్తింపు ఉంది. క్రిష్ సినిమాల్లో వేదం, గమ్యం, గౌతమీ పుత్ర శాతకర్ని మంచి హిట్ టాక్ అందుకున్నాయి. ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కక్కుండా సినిమా చూడటం అయిపోయిపోయిన తరవాత కూడా ఒక మంచి సినిమా చూసాం అన్న ఫీలింగ్ మనసులో ఉండిపోతుంది. ఇక ప్రస్తుతం క్రిష్ ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను క్రిష్ త్వరగా పూర్తిచేసే పనిలో ఉన్నారు. సినిమా షూటింగ్ ను వికారాబాద్ అడవుల్లో చిత్రిస్తున్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ పై డ్రగ్స్ కేసు ఆరోపణలు రావడంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. 

అయితే తాజాగా డ్రగ్స్ విచారణకు హాజరై తిరిగి హైదరాబాద్ చేరుకుంది. దాంతో సినిమా షూటింగ్ ను మళ్ళీ హైదరాబాద్ లో కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. సినిమాలో ఓ కీలక పాత్రకోసం క్రిష్ రానా ను సంప్రదించారట. అయితే సినిమాలో రానా నటిస్తున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను చకచకా పూర్తి చేసి క్రిష్ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారట.

More Related Stories