English   

కన్నడ డ్రగ్స్ కేసు..సంజనా మరో బిసినెస్ కూడా

sanjjanaa galrani
2020-10-09 08:44:05

కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కన్నడ పరిశ్రమకు చెందిన హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానికి సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలడంతో వారిని అరెస్టు చేయడం జరిగింది. దాంతో ఆ ఇద్దరూ ప్రస్తుతం బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో ఊసలు లెక్కపెడుతున్నారు. బెయిల్ కోసం ఇద్దరూ చేసుకున్న పిటిషన్ ను సైతం కోర్టు కొట్టిపారేసింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేకపోయినా కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారు అన్నదానిపై సీసీబీ ఎన్ఫోర్స్మెంట్ విచారణ వేగవంతం చేసింది. అయితే విచారణలో సంజనా, రాగిణి సెక్స్ రాకెట్ నడిపినట్టు నిర్ధారణ అయ్యింది. అంతే కాకుండా పార్టీలు ఏర్పాటు చేయడం , పార్టీలకు హాజరయ్యే ధనికులకు, ఇండస్ట్రీకి చెందినవారికి డ్రగ్స్ సరఫరా చేసినట్టు నిర్ధారణ అయ్యింది. 

అయితే తాజాగా మరో సంచలన విషయం భయటపడింది. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆశతో సంజనా...బింగో, హుకునా అనే రెండు చైనా యాప్ లను కూడా నిర్వహించినట్టు తేలింది. యాప్ లో సంజనా గేమింగ్ కు పాల్పడినట్టు వెల్లడైంది. ఇది ఒక కెసినో గేమ్ లాంటిది. హుకుమా యాప్ ద్వారా వారు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం జరిపేవారు. హుకుమా యాప్ ద్వారా సంజనాకు పెద్ద మొత్తంలో డబ్బు అందినట్టు కూడా అధికారులు గుర్తించారు.  ఈ నేపథ్యంలో డ్రగ్స్ కు సంబంధించి ఏమైనా లావాదేవీలు చేసారా అన్నదానిపై అధికారులు విచారణకొనసాగిస్తున్నారు.

More Related Stories