జగపతిబాబు తమ్ముడికి బెదిరింపు కాల్స్

2020-10-09 18:08:56
ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు సోదరుడుకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. జగపతిబాబు తమ్ముడు యుగేంద్ర కుమార్ ఫిల్మ్ నగర్ లో నివసిస్తారు. అయితే ఒక స్థలం విషయంలో ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుట్టల బేగంపేట స్థలానికి సంబందించి ఆయనకు ఫోన్ చేసి చంపేస్తామని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుమారుడిని కూడా హతమారుస్తామని హెచ్చరించారు. దాంతో ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బెదిరింపులకు పాల్పడింది బంజారాహిల్స్ కు చెందిన రాజిరెడ్డి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపులలు రావడంతో యుగేంద్ర కుమార్ కు ప్రొటెక్షన్ కల్పిస్తామని ధైర్యం చెప్పారు.