English   

ప్రభాస్ సినిమాలో బిగ్ బీ.. ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్

 Amitabh Bachchan
2020-10-09 13:27:10

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్బీ సినిమాను నిర్మిస్తోంది. అయితే నిన్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ ఇస్తామని చిత్ర  యూనిట్ నిన్న వెల్లడించిన సంగతి తెల్సిందే. ఈ మేరకు ఈరోజు భారీ సర్ప్రైజ్ ను ఇచ్చింది. సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్టు వెల్లడించింది.

"ఇలాంటి లెజెండ్ లేకుండా మేము లెజెండ్ లాంటి సినిమా తియ్యలేము..కోట్లాదిమంది భారతీయులకు గర్వకరణమైన నటుడిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మా ప్రయాణం మరింత పెద్దది అయ్యింది" అంటూ  వైజయంతి మూవీస్ పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రభాస్ 21వ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులకు ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా అమితాబ్ ఎంట్రీ తో సినిమా కు మరింత క్రేజ్ పెరిగింది. ఈ సినిమాను దర్శకుడు సైన్స్ ఫిక్షన్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో "రాదేశ్యామ్" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది.

More Related Stories