English   

మళ్ళీ పెళ్లి సందడి చేయబోతున్న దర్శకేంద్రుడు

Director K Raghavendra Rao
2020-10-09 13:50:58

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరోసారి పెళ్లి సందడి పేరుతో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా నిర్మించనుంది. కీరవాణి స్వరాలు అందించనున్నారు. కాగా చంద్రబోస్, శివశక్తి దత్త లిరిక్స్ ఇవ్వనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే సినిమాలో నటీనటులు ఎవరు అన్నది ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. కాగా 1996 లో శ్రీకాంత్ హీరోగా దర్శకేంద్రుడు పెళ్లి సందడి సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో పెద్ద హిట్ గా ఆ సినిమా నిలిచింది. రొమాన్స్, మ్యూజికల్ హిట్ గా రాఘవేంద్రరావు సినిమాను తెరకెక్కించారు. అయితే అప్పుడు కూడా సంగీతం కీరవాణి అందించడం విశేషం. సినిమాలో శ్రీకాంత్ సరసన దీప్తి భట్నాకర్, రవళి ప్రధాన పాత్రల్లో నటించారు. పెళ్లి సందడి కుటుంబ కథా చిత్రం కావడంతో ఎక్కువ మంది ప్రముఖ నటులు సినిమాలో నటించారు. ఇక తాజాగా మరోసారి పెళ్లి సందడి సినిమా తీయబోతున్నానని రాఘవేంద్రరావు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే సినిమాను ఈ కాలానికి తగ్గట్టుగా దర్శకేంద్రుడు ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.

More Related Stories