English   

గట్టిగా పేలిన అక్షయ్ లక్ష్మీ బాంబ్

 Laxmmi Bomb
2020-10-10 07:55:55

కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన రాఘవ లారెన్స్ దర్శకత్వంలోనూ ప్రతిభ చూపుతూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసిన లారెన్స్ బాలీవుడ్ లోను అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అది కూడా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ తో సినిమా తీసే ఛాన్స్ కొట్టడం విశేషం. తెలుగు లో వచ్చిన కాంచన సినిమాను లారెన్స్ అక్షయ్ హీరోగా "లక్ష్మి బాంబ్"పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఇక కొద్దిసేపటి క్రితమే అక్షయ్ లక్ష్మీ బాంబ్ ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ చూస్తే అక్షయ్ నటన చింపేసాడని అర్ధం అయిపోతుంది. దయ్యాలు బుతాలు లేవంటూ మొదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

అంతే కాకుండా అక్షయ్ షాపింగ్ మాల్ లో ఎర్ర చీర వేసుకుని "నాకు ఎలా ఉంది ఎలా ఉంది" అని అడిగే సీన్ హైలెట్ గా కనిపిస్తోంది. ట్రైలర్ పై ఇప్పటికే ఒక రేంజ్ లో లైకులు కూడా వచ్చాయి. ఈ  సినిమాలో అక్షయ్ సరసన కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో లారెన్స్ కొన్ని మార్పులు చేసి రీమేక్ చేసినట్టు తెలుస్తోంది. ఇక దీపావళి కానుకగా నవంబర్9న లక్ష్మి బాంబ్ ను ఓటిటీ లో విడుదల చేయనున్నారు.

More Related Stories