English   

విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాక్

Madras High Court
2020-10-10 09:29:05

విశాల్ హీరోగా గతేడాది నవంబర్ లో "యాక్షన్" అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు. సినిమాలో విశాల్ సరసన హీరోయిన్ గా తమన్నా నటించింది. అయితే ఈ సినిమాను నిర్మాణ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్ చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించాలని  నిర్ణయించుకుందట. అయితే ఒకవేళ సినిమా 20కోట్లు వసూలు చేయకపోతే దానిని తిరిగి ఇస్తానని విశాల్ హామీ ఇవ్వడంతో సినిమాను నిర్మాణ సంస్థ 40 కోట్లు ఖర్చుపెట్టి తీసింది. అయితే సినిమాకు తమిళనాడులో 7.7 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లు మాత్రమే వచ్చాయి. దాంతో నిర్మాణ సంస్థ చాలా నష్టపోయింది. కాగా విశాల్ తరవాత సినిమా కూడా ట్రైట్రెండ్ ఆర్ట్స్ లొనే చేస్తానని హామీ ఇచ్చారట. విశాల్ ఇప్పుడు మాట మార్చి సొంత బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. దాంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టు ను ఆశ్రయించారు. నిర్మాతలు వేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు విశాల్ ఆ నష్టాన్ని పూరించాలని చెప్పింది. నిర్మాతలకు 8.29 కోట్లకు గ్యారంటీ ఇవ్వాలని విశాల్ ను ఆదేశించింది.

More Related Stories