English   

ఆర్జీవీకి షాక్..హైకోర్టుకు దిశ తండ్రి

 Disha Father
2020-10-10 12:07:46

సంచాలనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో చిక్కు ఎదురైంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఆర్జీవీ వరుస సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మిర్యాలగూడ ప్రణయ్ హత్య పై "మర్డర్" అనే సినిమా తియ్యగా ప్రణయ్ తండ్రి కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. అంతే కాకుండా ఆర్జీవీ "దిశ ఎన్కౌంటర్" పేరుతో సినిమా తీస్తుండటంతో ఆ సినిమా పై కూడా కోర్టు లో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే అర్జీవీ దిశ ఎన్కౌంటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేశాడు. అయితే సినిమా పై దిశ తండ్రి పిటిషన్ వేయడంతో శుక్రవారం విచారించారు. దిశ ఘటనపై సుప్రీం కోర్ట్ లో విచారణ జరుగుతున్న సందర్భంలో ఇలా సినిమా చేయడం సరికాదన్నారు. దీనిపై సెన్సార్ బోర్డ్, కేంద్రం స్పందించాలని కోరారు. మరోవైపు బాధితురాలి తండ్రి ఎలాంటి వినతి పత్రం అందజేయలేదని కేంద్రం తరుపు అసోసియేట్ సోలిట రేట్ జనరల్ రమేశ్వర్ రావు అన్నారు. అంతే కాకుండా బాధితుల వినతి మేరకు వెంటనే చర్యలు తీలుకోవలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా ఆర్జీవీ ఈ సినిమాను దిశ పై జరిగిన సామూహిక హత్యాచారం ఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా కోసం ఆర్జీవీ ఇప్పటికే ఓ నిందితుడి భార్యతో ఓ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. ఆమెకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే యథార్థ సంఘటనలను చక్కగా తీసే ఆర్జివీ ఈ సినిమాను ఎలా తీయనున్నారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More Related Stories