English   

ఆ సమయంలో సూసైడ్ చేసుకోవలనుకున్నా..ముక్కు అవినాష్

Avinash
2020-10-10 12:34:43

బిగ్ బాస్-4 నిన్నటి ఎపిసోడ్ లో ఒకొక్కరు తాము లైఫ్ లో ఎదుకున్న కష్టాలను చెప్పుకున్నారు. దాంతో నిన్నటి ఎపిసోడ్ ఎమోషనల్ గా నడిచింది. ఈ క్రమంలో ముక్కు అవినాష్ కూడా తన లైఫ్ లో వచ్చిన కష్టాల గురించి చెప్పుకున్నాడు. అవినాష్ మాట్లాడుతూ...లాక్ డౌన్ లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని ఎమోషనల్ అయ్యాడు. లాక్ డౌన్ కాలంలో అందరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుకున్నారని. అలాంటి సమయంలో ఒక ఆర్టిస్ట్ గా ప్రజలకు హెల్ప్ చేయాలని, కానీ తనకు ఉన్న పరిస్థితుల కారణంగా ఆపని చేయలేకపోయానానని బాధపడ్డాడు. తనకు ఇప్పుడు 30 ఏళ్ల వయస్సు ఉంటుందని సొంతంగా ఇల్లు, కారు కొనుకున్నానని చెప్పాడు. అయతే ఇల్లుకు నెలకు 45 వేలు ఈఎంఐ కట్టాలని అది కట్టలేని పరిస్తితి కి వెళ్లిపోయానని అన్నాడు. అదే సమయంలో తన తండ్రికి హార్ట్ స్టాక్ వచ్చిందని ఆపరేషన్ కు 4లక్షలు ఖర్చు అయ్యాయని అన్నాడు.

మరోవైపు తన తల్లికి కూడా మోకాళ్ళు అరిగిపోయాయని వెల్లడించాడు. దాంతో ఇల్లుకోసం దాచుకున్న డబ్బులు ఖర్చు అయ్యాయని పేర్కొన్నాడు. డబ్బు కట్టలేని వాడు ఇల్లు ఎందుకు కొనుకున్నారు అనే ప్రశ్న రావచ్చు కానీ కట్టగలను అనే నమ్మకంతో కొన్నానని, తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని బాగా చూసుకోవాలని చెప్పుకొచ్చాడు. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే సంతోషంగా చూసుకోవాలని పేర్కొన్నాడు. తాను ఇల్లు కొనుకున్నా..కారు కొనుకున్నా దానికి కారణం ప్రేక్షకులే అని అన్నాడు. తల్లిదండ్రులు ప్రేక్షకుల వల్లనే ఇక్కడ ఉన్నానని అవినాష్ తెలిపాడు. అంతే కాకుండా తన స్నేహితులను సైతం తాను కుటుంబం గానే బావిస్తానని అన్నాడు. అయితే అవినాష్ ఎందుకు సూసైడ్ చేసుకోవలనున్నాడు అన్నది స్పష్టంగా చెప్పలేదు.

More Related Stories