English   

మా పిల్లలు ఒలింపిక్స్ కు రెడీ

 Mahesh Babu Namrata Shirodkars
2020-10-10 23:00:23

సెలబ్రెటీల పిల్లలు ఏం చేసినా వైరల్ అవ్వడం కామన్..ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు కూడా ఓ  సెలెబ్రిటీ అయిపోతారు కాబట్టి. అయితే కొంతమంది సెలబ్రెటీలు తమ పిల్లలను మీడియాకు చాలా దూరంగా ఉంచుతారు. మరికొంతమంది తరచూ పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సంబురపడుతుంటారు. అలా పిల్లల వీడియోలు వాళ్ళు చేసే పనులను షేర్ చేసే లిస్ట్ లో మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా ఒకరు. లాక్ డౌన్ కాలం నుండి నమ్రత..గౌతమ్, సితార చేసే అల్లరిపనులను, డ్యాన్స్ వీడియోలను, వాళ్ల టాలెంట్స్ ను భయటపెడుతున్నారు. తాజాగా నమ్రత మరో ఆసక్తికర పోస్ట్ చేసారు. గౌతమ్, సితార స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోను నమ్రత ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. పోస్ట్ లో తమ పిల్లలు ఒలింపిక్స్ కి సిద్ధమయ్యారు అని పేర్కొన్నారు. అంతేకాకుండా పిల్లలకు తమకు నచ్చిన పని చేయమని చెబుతానని, అన్నింటిలో ఆసక్తి చూపాలని చెబుతామన్నారు. వ్యాయామం తో పాటు వేరే ఆటలు అడటంవల్ల మెదడు కూడా ఉత్తేజితం అవుతుందని నమ్రత పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నమ్రత పేరు ఉందంటూ నేషనల్ మీడియా కథనాలు రాసింది. అయితే ఇప్పటివరకు ఆ విషయంపై నమ్రత స్పందించలేదు.

More Related Stories