English   

గోవాలో మెగా డాటర్ బ్యాచిలర్ పార్టీ

Niharika
2020-10-10 16:08:14

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. గుంటూరు కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కుమారుడు జొన్న గడ్డ వెంకట చైతన్యను ఆమె ప్రేమ వివాహం చేసుకోనుంది. అయితే తాజాగా ఆ ముద్దుగుమ్మ తనకు కాబోయే భర్తతో కలిసి ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి గోవాకి వెళ్ళింది. అక్కడ నిహారిక ఫ్రెండ్స్ కి గ్రాండ్ పార్టీ ఇస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కొద్దిరోజుల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్న కారణంగా నిహారిక బ్యాచిలర్ పార్టీని అరేంజ్ చేసింది. ఇదిలా ఉండగా నిహారిక కెరీర్ విషయానికి వస్తే డిజిటిల్ ప్లాట్ ఫామ్ ద్వారా మొదట ఆమె ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదట్లో షార్ట్ ఫిల్మ్ లు నిర్మిస్తూ అందులో నటిస్తూ అలరించింది. ఇక సినిమాల్లోకి అడుగుపెట్టిన తరవాత "సూర్యకాంతం,ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్" సినిమాల్లో నటించింది. అయితే వీటిలో ఒక్క సినిమా కూడా అంతగా సక్సెస్ అవ్వలేదు. ప్రస్తుతం మళ్ళీ డిజిటల్ వైపు మళ్లింది నిహారిక. ఇక పెళ్లి తరవాత ఈ భామ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories