ఓటు హక్కుపై రౌడీ సంచలన వ్యాఖ్యలు

ఓటు హక్కుపై నటుడు విజయ్ దేవరకొండ సంచలన కామెంట్స్ చేసాడు. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్స్ భరద్వాజ్ రంగన్ అనుపాతో ఆయన చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విజయ్ మాట్లాడుతూ..లిక్కర్ కోసం ఓటు అమ్ముకునే వాళ్లకు అసలు ఓటు హక్కు ఉండకూడదని వ్యాఖ్యానించారు. డబ్బుంకోసం ఓటు అమ్ముకునే ఓటు విలువ తెలియనివాళ్లకు అసలు ఓటు హక్కు ఎందుకని ప్రశ్నించారు. దాంతో సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. దాంతో వరుస ఆఫర్లు దక్కించుకుని ప్రముఖ బ్యానర్లలో సినిమా లు చేస్తూ బిజీ అయిపోయారు. అంతే కాకుండా ఇప్పుడు పురిజగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.