నవదీప్ నాగబాబు మధ్య విబేధాలు..అందుకే షో నుండి జంప్

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ లో జడ్జిగా చేసి భయటకు వచ్చాక అదిరింది షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ షోలో చాలా మార్పులు చేసి "బొమ్మ అదిరింది" అంటూ పేరు పెట్టారు. అయితే మొదటి స్కిట్ తోనే షో ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఆ స్కిట్ చేసినట్టు అర్థం అవుతుంది. దాంతో ఈ బొమ్మ అదిరింది కాస్తా రాజకీయ విభేదాలకు దారి తీసింది. దాంతో స్కిట్ వేసిన వారు జగన్ కు వైసీపీ కి క్షమాపణలు చెప్పారు. కానీ నాగబాబు మాత్రం ఎక్కడ తగ్గకుండా సై అంటే సై అంటున్నాడు. ఇదిలా ఉండగా షోలో మార్పులు చేసినప్పుడు. యాంకర్స్ గా ఉన్న రవి, బానుశ్రీ ని తొలగించారు. అంతే కాకుండా నాగబాబు తో పాటు జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్ ను సైతం షో నుండి తొలగించారు. కాగా నాగబాబు, నవదీప్ ఇద్దరూ చాలా క్లోజ్ కానీ నాగబాబు కు తెలియకుండా నవదీప్ ను షో నుండి తొలగించడం జరగదు. ఈ నేపథ్యంలో నాగబాబు మరియు నవదీప్ ల మధ్య విభేదాల కారణంగానే నవదీప్ ను తొలగించారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక ఈ విషయం ఇప్పటివరకు అటు నాగబాబు కానీ ఇటు నవదీప్ కానీ స్పందించలేదు. దాంతో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నిజమే అనిపిస్తుంది.