English   

జైల్లో ఇద్దరు భామల మధ్య గొడవ..పరుగులు తీసిన ఖైదీలు

Ragini Sanjana
2020-10-12 12:29:24

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇండస్ట్రీ కి చెందిన రాగిణి ద్వివేది, సంజనా గల్రాని లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ డ్రగ్స్ విక్రయించినట్టు నిర్ధారణ అవ్వడంతో బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష పొందుతున్నారు. అంతే కాకుండా విచారణలో భాగంగా సంజనా, రాగిణి సెక్స్ రాకెట్ నడిపినట్టుగా కూడా అధికారులు నిర్ధారించారు. దాంతో వారికో బెయిల్ రావడం కూడా కష్టమే అనిపిస్తోంది. అయితే తాజాగా రాత్రి ఈ ఇద్దరు భామలు జైలులో ఒకరిని మరొకరు దూషించుకున్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ కేకలు వేస్తూ ఒకరిని మరొకరు నిందించుకోవడంతో లోపల ఉన్న మహిళా ఖైదీలు భయటకు పరుగులు తీశారు. జైలు అధికారులు ఇద్దరికి నచ్చజెప్పినప్పటికి వినకుండా గోడవపడ్డారు. నీ వల్లే నేను ఇప్పుడు జైలులో ఉన్నానని ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. కేవలం నీ స్నేహం వల్లనే నేను ఇలా మారాను అంటూ రగిణిపై సంజనా నిప్పులు చెరిగింది. అంతే కాకుండా ఒక దశలో ఇద్దరు కలిసి కొట్టుకునేంతబపని చేసారట దాంతో చేసేది లేక ఇద్దరినీ వేరు వేరు బ్యారెక్ లలోకి మార్చారు.  కాగా శనివారం సంజన పుట్టినరోజు కావడంతో ఆమె ఆవేదన చెందరట. పుట్టినరోజు వేడుకలను స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి పెద్ద హోటల్ లో జరుపుకునే దానినని ఇప్పుడు ఇలా మరిపోయాను అని ఆవేదన వ్యక్తం చేసింది. దానికి రాగిణి ఏ కారణం అంటూ పేర్కొంది.

More Related Stories