English   

త్వరలోనే తల్లి కాబోతున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్.. 

 Anita Hassanandani
2020-10-12 12:50:36

అనిత హసానందని.. ఈ పేరుతో తెలుగు ఆడియన్స్‌కు బాగానే పరిచయం. అయితే పేరు మాత్రం అలా చెప్పకూడదు. నువ్వు నేను అనిత అని చెప్పాలి. మిలీనియం మొదట్లో చాలా మంది హీరోయిన్లు తెలుగులో బాగానే మెరిసారు. ఆనందం సినిమాతో రేఖ.. నువ్వే కావాలి సినిమాతో రి.. అలాగే నువ్వు నేను చిత్రంతో అనిత.. ఇలా చాలా మంది దృష్టిని ఆకర్షించారు వాళ్లు. 2001లో వచ్చిన నువ్వు నేనుతో అప్పట్లో సెన్సేషనల్ స్టార్ అయింది అనిత. కానీ ఆ తర్వాత మాత్రం అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయింది. నాలుగైదేళ్ళ వరకు వరస సినిమాలు చేసింది కానీ కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు ఈమెకు. ఆ తర్వాత పదేళ్లకు 2013లో పారిశ్రామిక వేత్త రోహిత్‌తో ఏడడుగులు వేసింది ఈమె. ఈయన తెలుగు వాడు కావడం విశేషం. వీళ్ల పెళ్లి జరిగి ఏడేళ్ళు అవుతుండగా ఇప్పుడు అనిత తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. 

రోహిత్‌తో కలిసి ప్రత్యేక వీడియోని రూపొందించి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. తను గర్భవతిని అనే విషయాన్ని తెలియజేసింది అనిత. ఈమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో రోహిత్‌తో తన పరిచయం, ప్రేమ, పెళ్లి తదితర విషయాలు అన్నీ కనిపిస్తున్నాయి. అంతేకాక తను షేర్ చేసిన మరో వీడియాలో.. తల్లితండ్రులు కావడం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుందని చెప్పుకొచ్చింది. మరపురాని ప్రయాణంలో జరిగిన మధురానుభూతులు ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు ఆ అనుభూతులకు సాక్ష్యంగా మరో ప్రాణం లోకంలోకి వస్తుందని చెప్పుకొచ్చింది అనిత. చాలా ప్రశ్నలకు ఈమె ఈ వీడియోలో సమాధానం చెప్పింది. తాళ్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన అనిత పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో ఉదయ్ కిరణ్ హీరోయిన్‌గా ఈమెకు మంచి గుర్తింపు ఉంది. నువ్వు నేను తర్వాత శ్రీరామ్ సినిమాలో కూడా కలిసి నటించారు ఈ ఇద్దరూ. అలాగే అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ సహా మరికొందరు హీరోలతో కూడా నటించింది అనిత. 

More Related Stories