English   

గంగవ్వ చెప్పిందే జరిగింది..సుజాత ఔట్

Bigg Boss Telugu 4
2020-10-12 13:05:12

బిగ్ బాస్ సీజన్-4 సక్సెస్ఫుల్ టిఆర్పీ తో కొనసాగుతోంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. అయితే "మై విలేజ్ షో" యుట్యూబ్ ఛానల్ లో ఫేమస్ అయిన గంగవ్వ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి పల్లెల్లో సైతం బిగ్ బాస్ కు క్రేజ్ ను తెచ్చిపెట్టింది. కాగా ఆమె అనారోగ్య కారణాలతో ఎలిమినేషన్ లేకుండానే శనివారం జరిగిన ఎపిసోడ్ లో భయటకు వచ్చింది. తనకు ఆరోగ్యం బాగుండటం లేదంటూ..హౌస్ లో నిద్ర పట్టడంలేదంటూ తన గోడును బిగ్ బాస్ కు చెప్పుకుంది. దాంతో ఆమెను డాక్టర్లు పరీక్షించారు. కొంత అనారోగ్య లక్షణాలు ఉండటంతో ఆమెను ఇంట్లో నుండి పంపించాడానికి ఒప్పుకున్నారు. అయితే హౌస్ లో నీరసంగా కనిపించిన గంగవ్వ హోస్ట్ నాగార్జున వద్దకు రాగానే యాక్టివ్ అయ్యింది.

ఈ సంధర్భంగా గంగవ్వ సుజాతపై ఆసక్తికర కామెంట్లు చేసింది. సుజాత ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉంది. కాగా గంగవ్వ సుజాతతో మాట్లాడుతూ..ఈ వారం నువ్వే భయటకు వస్తావేమో అనిపిస్తుంది. ఇంటికి పోయాక టీవీ చూస్తాను. అంటూ కామెంట్ చేసింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నిజం అయ్యినట్టు తెలుస్తోంది. సుజాత ఎలిమినెట్ అయ్యిందటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా సుజాత ఎలిమినేషన్ లోకి రావాలంటూ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆమె వెక్కిలి నవ్వు, నాగార్జున ను బిట్టు అని పిలవడం ప్రేక్షకులకు ఇరిటేషన్ తెచ్చించిందని అంటున్నారు. ఆమె టాస్కుల్లో బాగానే అడుతున్నప్పటికి ఈ రెండు కారణాలతోనే ప్రేక్షకులు సుజాతకు ఓట్లు వేయలేదని తెలుస్తోంది.
 

More Related Stories