English   

దయచేసి పొట్ట మీద కొట్టొద్దు..బండ్ల ఎమోషనల్

bandla ganesh
2020-10-12 17:03:30

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇటీవలే కరోనా నుండి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే బండ్ల గణేష్ కరోనా నుండి కోలుకున్న తరవాత తనలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఇప్పటివరకు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ట్విట్టర్ లో ఓ పోస్ట్ కూడా చేసారు. అయితే తాజాగా ఆయన బావోద్వేగంతో మరో ట్వీట్ చేశారు. "వీపు మీద కొట్టండి. కానీ దయచేసి కడుపు మీద కొట్టకండి. ఇది నా విన్నపం. నేను చెప్పేదాకా నా మీద ఎలాంటి వార్తలు రయొద్దు ఇది నా అభ్యర్థన" అంటూ బండ్ల ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. 

అయితే గతంలో ఎలక్షన్స్ టైమ్ లో బండ్ల కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ టికెట్ ఆశించారు. అంతే కాకుండా న్యూస్ చానల్స్ లో ఇంటర్వ్యూ లు ఇస్తూ ప్రతిజ్ఞలు కూడా చేశాడు. అక్కడితో ఆగకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడుతో కోసుకుంటా అంటూ డైలాగ్స్ కొట్టాడు. దాంతో ఆయనపై అటు సోషల్ మీడియా ఇటు మీడియా వరుస కథనాలు ప్రచురించాయి. ఆ దెబ్బకు బండ్ల రాజకీయాల్లో నుండి తప్పుకున్నాడు. ఇక తాజాగా పవన్ తో సినిమాను నిర్మించే అవకాశం రావడంతో బండ్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. దేవుడు ఛాన్స్ ఇచ్చేశాడు అంటూ కుషీ అయ్యాడు. అయితే బండ్ల పవన్ సినిమాలో దర్శకుడిపై క్లారిటీ ఇవ్వలేదు. దాంతో దర్శకుడి పై పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది.

More Related Stories