English   

మహాసముద్రంలో మణిరత్నం హీరోయిన్

Aditi Rao Hydari
2020-10-12 18:11:12

టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు ఉన్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. శర్వా తన కెరీర్ ను సైడ్ యాక్టర్ గా మొదలు పెట్టి హీరో అయ్యాడు. ఆ తరవాత గమ్యం సినిమాతో ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. ఇక ఆ సినిమాతో వరుస సినిమాలు దక్కించుకున్నాడు. అయితే శర్వా గత కొంతకాలంగా హిట్లు లేక సతమతం అవుతున్నాడు. దాంతో ఇప్పుడు వరుస సినిమాలను ఒప్పుకున్నాడు. ప్రస్తుతం శర్వా "శ్రీకారం" అనే సినిమాలో నరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా తరవాత ఆర్ ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి తో "మహా సముద్రం" అనే సినిమాలో నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు కూడా. ఇక ప్రాజెక్ట్ క్రేజీ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా లో శర్వతో పాటు సిద్ధార్థ్ కూడా నటిస్తున్న సంగతి    తెలిసిందే. ఇక ఇప్పుడు ఏ సినిమా గురించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. సినిమాలో శర్వానంద్ సరసన "సమ్మోహనం" భామ అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇక ఈ సినిమాతో అజయ్ భూపతి మరో హిట్ కొడతాడో లేదో చూడాలి. అంతే కాకుండా శర్వా, సిద్ధార్థ్ లకు కు కూడా ఈ సినిమా విజయం ఎంతో అవసరం. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

More Related Stories