English   

ఫైర్ బ్రాండ్ ని కూల్ చేసిన హైదరాబాద్

kangana ranaut
2020-10-13 12:28:57

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో జయలలిత తొలినాటి రాజకీయ ఘట్టాన్ని చిత్రిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కోసం నిర్మాతలు ఒక స్టూడియో మొత్తాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ స్టూడియోలో దర్శకుడు, ఆయన భార్య, కంగనా ఉంటున్నారు. షూట్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మొత్తం స్టూడియోను రెంట్ కి తీసుకున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ కోసం రెండు వారాల పాటు కంగనా హైదరాబాద్ లోనే ఉండనుంది. అయితే తాజాగా హైదరాబాద్ వాతావరణం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ అందంగా ఉంది. ఇక్కడి వాతావరణం హిమాలయాలను తలపిస్తోంది. సూర్యోదయం సమయం మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. అంటూ హైదరాబాద్ అందాలను పొగిడింది హాట్ బ్యూటీ. ఇక హైదరాబాద్ వాతావరణం పై ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు తమ అభిప్రాయాలను తెలుపుతూ..తమకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇప్పుడు ఫైర్ బ్రాండ్ కంగనా ను కూడా హైదరాబాద్ ఆకట్టుకుంది.

More Related Stories