English   

ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అంతే నిశ్శబ్దంగా వెళ్ళిపోయిందిగా..

 Anushka Shetty
2020-10-13 13:21:48

నిశ్శబ్దం అని టైటిల్ ఏ ముహూర్తాన  పెట్టారో తెలియదు కానీ దానికి తగ్గట్టుగానే సినిమా విషయంలో కూడా జరిగింది. థియేటర్లు మూత పడటంతో ఎప్పుడు ఏప్రిల్ లో రావాల్సిన సినిమా కాస్త అక్టోబర్ 2న డిజిటల్ లో నేరుగా విడుదలైంది. అనుష్క శెట్టి, మాధవన్, అంజలి, శాలిని పాండే లాంటి స్టార్ కాస్ట్ ఉన్న నిశ్శబ్దం అంతే నిశ్శబ్దంగా వచ్చి వెళ్ళిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో దాదాపు 23 కోట్లకు ఈ సినిమాను తీసుకుంటే వాళ్లకు భారీ  నష్టాలు మిగిల్చిందని తెలుస్తోంది. విడుదలైన తొలి రోజు ఈ చిత్రానికి ఒక సోషల్ మీడియాలో భారీగా నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ మాత్రం సినిమా కోసం అమెరికా ఎందుకు వెళ్లారు.. ఇలాంటి కథలు ఇంతకుముందు చాలా వచ్చాయి కదా.. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చూపించారు అంటూ సెటైర్లు వేశారు.

అనుష్క శెట్టి ఉన్నా కూడా సినిమాపై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆమె ఇమేజ్ అమెజాన్ ప్రైమ్ కు అసలు పనికి రాలేదు. పైగా ఇది వరకు చూసిన ఎన్నో సినిమాలు దీనికి పోలి ఉండటంతో నిశ్శబ్దం అంతే నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ సినిమా నుంచి అమెజాన్ కు నష్టాలు భారీగానే రావడంతో నిర్మాతలకు డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం కొంత మేరయినా వాళ్లు తిరిగి ఇవ్వాలని వార్తలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో మంచు విష్ణు హీరోగా వస్తాడు నా రాజు సినిమా చేసిన హేమంత్ మధుకర్.. దాదాపు 8 ఏళ్ల విరామం తీసుకొని నిశ్శబ్దం సినిమా చేశాడు. ఈసారి కూడా పరిస్థితులు మారలేదు.. ఫలితం కూడా మారలేదు. ఈ సినిమా పరాజయం అనుష్క కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించేలా కనిపిస్తుంది. ఇక మాధవన్ కూడా తెలుగు సినిమాలో ఐరన్ లెగ్ అయిపోయాడు. గతంలో ఈయన నటించిన సవ్యసాచి డిజాస్టర్ గా నిలిచింది.

More Related Stories