English   

విజయ్ దేవరకొండ పై కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడు

 Vijay Deverakonda
2020-10-13 14:10:04

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు. అయితే ఇటీవల కొంత ఖాళీ సమయం దొరకడంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కాడు. విజయ్ ఓ ప్రముఖ మూవీ క్రిటిక్ తో కలిసి చిట్ చాట్ చేశారు. ఆ సందర్భంగా మద్యం సేవించేవాళ్లకు ఓటు హక్కు ఉండకూడదంటూ వ్యాఖ్యానించాడు. ఈ విషయం ఇప్పుడు వివాదాలకు దారి తీస్తుంది. విజయ్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు గుల్షన్ కాస్త గట్టిగా స్పందించాడు.  "తలలో ఉన్న ఒత్తిడి కొంతమేరకు తగ్గిపోవలంటే నేను మీకు ఒక హెయిర్ స్టైల్ సూచిస్తా" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక తన అన్నపై కామెంట్ చేయడంతో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ "తెలివైన వారు ఎవరైనా ముందు ఎదుటివ్యక్తి ఏం మాట్లాడారో అర్థం చేసుకోవాలి. అంతేకానీ సదరువ్యక్తి గురించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టకూడదు" అంటూ ఆనంద్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో చూడాలి. ఇక ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇదివరకు ఫారెన్ లో ఉద్యోగం చేసిన ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ హీరో అవ్వడంతో అతడి ఇన్ఫ్లుయెన్స్ తో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమా "దొరసాని"లో నటించి ప్రేక్షకులను అలరించాడు

More Related Stories