English   

యాసిడ్ రెయిన్స్ వస్తాయి..మనం పోతాం..పూరీ

Acid Rain
2020-10-13 14:16:48

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ లాక్ డౌన్ సమయం నుండి పూరీ మ్యుజింగ్స్ పేరుతో అనేక అంశాలపై తనదైన రీతిలో మాట్లాడుతూ ప్రజలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. తాజాగా పూరీ "యాసిడ్ రెయిన్స్" అనే ఆసక్తికర అంశంపై మాట్లాడారు. వీడియోలో పూరీ మాట్లాడుతూ..."నాలుగు వందల కోట్ల సంవత్సరాలకు ముందు వర్షాలు పడి భూమి మీద సముద్రాలు తయారయ్యాయి. అనేక జీవాలు పుట్టాయి. హాయిగా ఆడుకుంటున్నాయి. అయితే రెండు వందల యాభై మిలియన్‌ సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో రకరకాల గ్యాసులు రిలీజై ఆకాశం నుండి యాసిడ్‌ వాన పడింది. నైట్రిక్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్స్ కలిసిన వర్షం. ఇది ఆగకుండా రెండు మిలియన్‌ సంవత్సరాలు పడింది. దీంతో సముద్రంలో జలచరాలు చచ్చిపోయాయి. అదే కాలంలోకాలంలోని డైనోసార్స్‌ సహా అన్నీ జంతువులు యాసిడ్ రెయిన్ వలన చచ్చిపోయాయి. ఇదంతా భూమి ఒకే ఖండంగా ఉన్నప్పుడు జరిగింది. ఆ యాసిడ్‌ వాన తర్వాత సముద్ర జలాలు ఉప్పుగా తయారయ్యాయి. 

మళ్లీ ఆ సముద్ర నీటికి తగ్గట్లు జలచరాలు పుట్టాయి. ఆ తర్వాత మనం పుట్టాం. అలా ఇలా బ్రతుకుతూ ఇవాళ కరోనా వరకు వచ్చాం. కొన్ని వందల సంవత్సరాల నుండి రోజు మనం బొగ్గును తగలబెడుతున్నాం. వీటి వల్ల మనకు మళ్లీ యాసిడ్‌ రెయిన్‌ పడే అవకాశం ఉంది. ఈ వాన పడితే ముందు పక్షులు, భూమి మీద చెట్లు అన్నీ చచ్చిపోతాయి. తర్వాత మనం కూడా చచ్చిపోతాం. యాసిడ్ రెయిన్ ఇప్పుడు రెండు మిలియన్ సంవత్సరాలు కాదు, రెండు వారాలు పడ్డా కూడా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పుడు వైరస్‌లకంటే, గ్రహ శకలాల ఢీ కొట్టడం కంటే, మూడో ప్రపంచ యుద్ధం కంటే చాలా పెద్ద ప్రమాదం ఏదైనా ఉంటే యాసిడ్‌ రెయిన్‌ మాత్రమే. మనుషులు పెరిగే కొద్దీ కాలుష్యం పెరుగుతుంది, ఏదో ఒక రోజు వరుణదేవుడు యాసిడ్ రెయిన్ కురిపిస్తే అంతా పోతాం. ఇలాంటివి చెబితే వచ్చిన రోజు చూసుకుందాంలే అనుకుంటాం. అవి వస్తాయి , మనం చూస్తాం కూడా. ఇలాంటి ప్రళయాలు తగ్గాలంటే 80 శాతం జనాభా తగ్గాలి..అది సాధ్యం కాదు. పిల్లలని కనొద్దు అంటే నా కొడుకే కారణమా అంటూ వెళ్లవోయ్ అని ఇంకో కొడుకును కంటాం. పిల్లలని కనడం ఆగదు, వర్షాలు రాకుండా ఉండవు" అంటూ పూరీ ఆమ్లవర్షాల గురించి సుదీర్ఘంగా వివరంగా మాట్లాడారు.

More Related Stories