English   

సినిమాలో భాగం అవ్వడం గౌరవంగా భావిస్తున్నా.. బిగ్ బీ

Amitabh Bachchan
2020-10-13 14:38:23

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఫ్యాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఉన్నదంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. "లెజెండ్ అమితాబ్ లేకుండా లెజండరీ సినిమాను ఎలా నిర్మిస్తాం" అంటూ వైజయంతి మూవీస్ స్పష్టం చేసింది. సినిమా ను సైన్స్ ఫిక్షన్ కథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇదిలా ఉండగా సినిమాపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ స్పందించారు. "సినిమాలో భాగం కావడాన్ని ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నా..50 ఏళ్ళు పూర్తి చేసుకున్న వైజయంతి మూవీస్ మరో 50 వసంతాలు పూర్తి చెలుకోవాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకున్నట్లు సమాచారం. స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాను భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. త్వరగా షూటింగ్ పూర్తి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

More Related Stories