English   

పవర్ స్టార్ సినిమాలో ప్రత్యేక పాత్రలో శ్రీకాంత్.. 

 Srikanth
2020-10-14 08:30:42

తెలుగు ఇండస్ట్రీలో శ్రీకాంత్ కు ఎలాంటి ఇమేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్లుగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఈయన. అప్పట్లో సంచలన సినిమాలు చేసి స్టార్ కూడా అయ్యాడు. ఆ తర్వాత మెల్లగా తన వయసుకు సరిపోయే పాత్రలు చేస్తున్నాడు. తాజాగా ఇప్పుడు కారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు శ్రీకాంత్. ఇప్పటికే చాలా సినిమాలు చేసాడు కూడా. మధ్యలో యుద్ధం శరణం లాంటి సినిమాల్లో విలన్‌గానూ కనిపించాడు. మిగిలిన సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలో శ్రీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడు. దాంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

అయితే పవర్ స్టార్ అంటే మన పవన్ కళ్యాణ్ కాదండోయ్.. ఇక్కడ పవర్ స్టార్ అంటే కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్. అక్కడ ఆయన కూడా పవర్ స్టారే. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అత్యధిక హిట్ పర్సెంటేజ్ ఉన్న సౌత్ ఇండియన్ హీరోల్లో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంటాడు పునీత్. అంతటి ఫాలోయింగ్ మనోడి సొంతం.. కన్నడ సినిమా మార్కెట్‌ను తన సినిమాలతో పెంచేస్తున్నాడు పునీత్. అలాంటి హీరోతో నటించాలని చాలా మంది నటీనటులు కోరుకుంటారు. ఇప్పుడు శ్రీకాంత్‌కు ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. స్వతహాగా శ్రీకాంత్ కన్నడిగుడే.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. సొంత భాషలో కొన్ని సినిమాలు కూడా చేసాడు. 

1993లో హెందితి హెలిదారే కాలబేకు సినిమాలో నటించాడు. ఆ తర్వాత 2007లో ఉపేంద్ర హీరోగా వచ్చిన సంతోషం రీమేక్ ఉగాదిలో తెలుగులో ప్రభుదేవా చేసిన పాత్రలో కనిపించాడు. రెండేళ్ల కింద 2018లో శివరాజ్ కుమార్, సుదీప్ హీరోలుగా వచ్చిన ది విలన్‌లో చివరగా నటించాడు. ఇప్పుడు మరోసారి పునీత్ రాజ్‌కుమార్ హీరోగా వస్తున్న జేమ్స్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్రలో శ్రీకాంత్ కనిపించబోతున్నాడు. చేతన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కిషోర్ పత్తికొండ నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. మొత్తానికి కన్నడలో కూడా బిజీ అవుతున్నాడు ఈ సీనియర్ హీరో. ఇప్పటికే మలయాళంలో కూడా విలన్ అనే సినిమాలో నటించాడు శ్రీకాంత్. 

More Related Stories